ఇప్పుడు ప్రపంచము నోవహు దినములలో వలె లోతు దినములో వలె ఉన్నది. నోవహు దినములలో, లోతు దినములలో తిండి వలనను, ఐహికవిచారము వలనను మందులై ఉన్నందున అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు యావే ఉగ్రత వచ్చి వారినందరిని నాశనము చేసినది, తిండి వలనను ఐహిక విచారము వలనను మందులుకాని నీతిమంతులే యావే ఉగ్రత తప్పించుకొనిరి. ఇప్పుడు కూడా జనులు అలాగే ఉన్నారు. అకస్మాత్తుగా యావే ఉగ్రత భూమి మీదికి వచ్చును. గనుక ఏడు సంఘకాలములలోని ఏడుగురు దూతలు తరువాత మరి ఏ వర్త మానికుడు లేడా ? ఉంటే ఎవరు ? పెండ్లికుమార్తె ఎప్పుడు ఎత్తబడును ? శ్రమలు ఎప్పుడు ప్రారంబమగును ? వెయ్యేండ్లపాలన ఎప్పుడు వచ్చును ? అనే తదితర ప్రశ్నలకు జవాబులను ఇక్కడ కనుగొందాము.

రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. హొషేయ 6:1-3, రెండు దినములనగా రెండు వేల సంవత్సరాలు. రెండు వేల సంవత్సరాలు మాత్రమే అన్యులకు ఇవ్వబడిన కృపాకాలము. ఇక మెస్సయ్య ఇజ్రాయెల్ వైపు తిరుగాబోతున్నాడు ఇది మధ్యాకాశమునకు పెండ్లికుమార్తె ఎత్తబడవలసిన సమయము అని నీవు గ్రహించగలవు.

ఆదాము దగ్గర నుండి నోవాహు కాలానికి రెండువేల సంవత్సరములు. అప్పుడు జలప్రళయము వచ్చినది. నోవాహు దగ్గర నుండి మెస్సయ్య వరకు రెండువేల సవత్సరములు. అప్పుడు కృపవచ్చినది. ప్రతి రెండువేల సవత్సరాలకి ఒక మార్పు జరిగినది. గనుక మెస్సయ్య దగ్గరనుండి ఇప్పటికి రెండువేల సవత్సరములు, ఇప్పుడు ఒక మార్పు జరగవలసి యున్నది. ఆమార్పు ఏమిటనగా నీతిమంతులు పెండ్లివిందుకు మద్యాకాశమునకు ఎత్తబడుట. మెస్సయ్య యూదుల వైపు తిరుగుట. ఆ తరువాత లోకమునకు శ్రమలు, ఆ తరువాత ఏడవ వెయ్యి వచ్చును అనగా వెయ్యేండ్లపాలన వచ్చును.

ఈ సమయమును మనము చూచినప్పుదు పెండ్లికుమార్తె ఎత్తబడు సమయము ఇదేనని గ్రహించగలము. పెండ్లి కుమార్తె ఎత్తబడు సమయమును గురించి క్రింద వివరించుచున్నాను.

11 పేతురు,1:5-11 విశ్వాసము, జ్ఞ్యానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ప్రేమ అను ఎనిమిది లక్షణములు కలిగిన వారికి నిత్యరాజ్యములో ప్రవేశము సమృద్ధిగా లభించును అని ఉన్నది. పరిశుద్ధాత్మ ఈ లేఖనము విషయమై బయలుపరచుట ద్వారా ఎనిమిది లక్షణములను సంఘకాలములకు, వర్తమానికులకు పోల్చి క్రింద విధంగా సమాజములో భోధించితిని.

piramid-1-1024x613

               ఏడు సంఘ కాలములకు ఏడుగురు దూతలు తరువాత వేకువచుక్క వాగ్ధానము చేయబడియున్నందున వేకువచుక్కను ప్రేమకు పోల్చిబోధించితిని. ఉదయకాలపు వర్తమానికుని యొక్క పరిచర్య ప్రేమకు సంబందించినది. గనుక ఫిలేమోన్ అనే పేరు సరిపోవుట చూడగలము. ఫిలేమోన్ అనగా ప్రేమ గలవాడని అర్దము.2011 లో వధువు స్వరూపము గురించి భోధించమని నన్ను పరిశుద్ధాత్మ ఒత్తిడి చేసినది. అందు విషయమై ప్ర్రార్ధించుచుంటిని. ఒక రోజు నేను కొన్ని పుస్తకములు వెదకుచుండగా బ్రెన్ హం గారు ప్రసంగించిన “ఒక పరిపూర్ణ మానవుని స్వరూపము” (అక్టోబరు 14-1962 జెఫర్సన్ విల్, ఇండియానా, అమెరికా) అను పుస్తకము చూచితిని. ఆ పుస్తకము అట్టపైన “స్వరూపము” అనే మాట ఉండుటను బట్టి ఆ పుస్తకమును చదవాలని పేజీలు త్రిప్పితిని, అందులో పిరమిడ్ ఆకారము గల చిత్రము కనబడినది. ఒక పరిపూర్ణ మానవుని స్వరూపము పిరమిడ్ ఆకారములో ఉన్నది. దానిని క్రింద ఇచ్చుచున్నాను.

final 5

పై పిరమిడ్ చూసి ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే నాకు పరిశుద్దాత్మ బయలుపరచిన విషయమే 1962 లో బ్రెన్ హం గారికి బయలుపరచినది. ఇప్పటికీ ఒకే విధముగా బయలుపరచబడినది. నాకు పరిశుద్దాత్మ బయలుపరచిన విధముగా బ్రెన్ హం గారికి బయలుపరచబడిన విషయము “ఒక పరిపూర్ణమానవుని స్వరూపము” అనే పుస్తకము చదివే వరకు నాకు తెలియనే తెలియదు.వేకువ జామునే మెస్సయ్య లేపబడ్డాడు. గనుక పెండ్లికుమార్తె వేకువజామునే ఎత్తబడవలసియున్నది. గనుక ప్రేమ అను తలరాయి పిరమిడ్ పై వేకువజామున అమర్చబడినట్లు యాషువా స్వరూపము పరిపూర్ణమైనట్లు ఈ క్రింద గీసితిని.

final 4

ఇప్పుడు గమనించండి. ఒక పరిపూర్ణమైన మానవుని స్వరూపము పూర్తియైనది. ప్రేమ అను తలరాయి వచ్చియున్నది. ప్రేమ అను తల రాయి పైకి రమ్ము ఈ లోకమునకు శ్రమలు రాబోవుచున్నాయి. లోకము నాశనము కాబోతోంది అని బోధించునని  పరిశుద్దాత్మ బయలుపరచినది.

ఏడు సంఘ కాలములు ఏడుగురు దూతలు తరువాత వేకువచుక్క గురించి ప్రేమ అను తలరాయి గురించి ఇంకా వివరముగా చూద్దాం.
మెస్సయ్య యొక్క పెండ్లికుమార్తె తప్పనిసరిగా ఈ వేకువ జాము కాలమును గుర్తించవలసియున్నది. ఈ సమయము పెండ్లికుమార్తెకే తప్ప అన్యులకు కాదు. చివరి సంఘకాలమైన లవోదికయ సంఘకాలమును గుర్తింపజేయుటకు ఏలియా ఆత్మ గల సాయంకాలపు దూతను పంపిన సర్వాధిపతే ఈ కాలమును గుర్తింపజేయుటకు ఉదయకాలపు దూతవచ్చుననిచెప్పెను. మోషే వచ్చినప్పుడు అది ఏ కాలమో మెస్సయ్య వచ్చినప్పుడు అది ఏ కాలమో, ఏడవ దూత వచ్చినప్పుడు అది ఏకాలమో బయలుపరచబడిన రీతిగా ఉదయకాలపు నక్షత్రము వచ్చినప్పుడు ఒక కాలము బయలుపరచబడును.

ఎందు కంటే సూచనలు దిన సంవత్సరములను, కాలములును మెస్సయ్య మరియు ఆయన దూతలు, ఆయన సమాజము సూచించునని
ఆది 1:14,15 లో చెప్పబడినది.

 • ప్రకటన 2:26-28 లో నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులు మీద అధికారమిచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువచుక్కను ఇచ్చెదను. అంతము వరకు మెస్సయ్య క్రియలు జాగ్రత్తగా చేయువానికి వేకువచుక్కను ఇచ్చెదనని సర్వాధిపతి పెండ్లికుమార్తెకు వాగ్దానము చేసినాడు.
 • ఆయన చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇజ్రాయేలు లో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును. కలహ వీరులందరిని నాశనము చేయును. సంఖ్యా 24:17.
 • జ్ఞ్యానులు తూర్పు దిక్కున ఆయన నక్షత్రము ద్వారా యూదయ దేశపు బెత్లెహేములో మెస్సయ్యని దర్శించిరి. మత్తయి 2:2. ఆ నక్షత్రము మెస్సయ్య రాకను ఆజ్ఞ్యానులకు తెలిపిన రీతిగా యెలియేజరు ఇస్సాకు దగ్గరకు రిబ్కాని తీసుకు వెళ్ళిన రీతిగా ఇప్పుడు వేకువచుక్క మధ్యాకాశమునకు వచ్చు మెస్సయ్య దగ్గరకు తన ప్రేమద్వారా పెండ్లికుమార్తెకును తీసుకువెళ్ళును.
 • సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుటకు యాషువా అను నేను, నాదూతను పంపియున్నాను. దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువచుక్కనైయున్నాను (ప్రకటన 22:16) ఆ నక్షత్రము యాషువా మెస్సయ్యే . నక్షత్రమును, దావీదును, తనను కలు పుచూ నేను దావీదు నక్షత్రమని మెస్సయ్య చెప్పుచున్నాడు.

పై వచనములను బట్టి వేకువచుక్క పెండ్లికుమార్తెకు ఇవ్వబడునని చూడగలము. ఏడు సంఘకాలములో ఏడుగురు దూతల తరువాత వేకువచుక్క వచ్చునని వాగ్ధానము చేయబడియున్నది. ఏడవదూతయైన విలియం మారియన్ బ్రెన్ హాం తరువాత ఏ దూత లేనట్లయితే మరి వేకువచుక్క వాగ్ధానము ఎప్పుడు నెరవేర్చబడును ? గనుక తప్పనిసరిగా సాయంకాలపు దూత తరువాత ఉదయకాలపు దూత ఉండవలసియున్నది. వేకువచుక్క పగటికి ముందుగా ఉండునని సహొదరుడు బ్రెన్ హాం తన వర్తమానములో కొన్ని సంద ర్బములలో ప్రస్తావించారు. “బలవంతుడగు సర్వశక్తిమంతుడు మనముందు ప్రత్యక్షమాయెను ” (జూన్ 29, 1964 ఫిలిదెల్ఫియా అమెరికా) అనువర్త మానములో ఆయన రాకడ సూచన మనము చూస్తున్నామని, పగటికి ముందు చిక్కని చీకటి యుండునని అప్పుడు వేకువచుక్క వచ్చి పగలు వచ్చునని ప్రకటించునని ఆయన రాక వచ్చుచున్నదని దూత చెప్పుచున్నాడని చెప్పిరి. వేకువచుక్కవచ్చి పగలు వచ్చునని ప్రకటించునని సహోదరుడు బ్రెన్ హాం చెప్పియుండగా వేకువచుక్కతో పనిలేదని చెప్పుట కొంతమంది అవివేకమే.

 • రోమా 13:11-14 లో మరియు మీరు కాలము నెరిగి, నిద్రమేలుకొను వేళయైనదదని తెలుసుకొని ఆలాగుచేయుడి. మనము విశ్వాసుల మైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజోస్సంబంధమైన యుద్దోపకరణములు ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తయినను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు యాషువా మెస్సయ్యను ధరించుకొనినవారై, శరీరేచ్చలను నెరవేర్చుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అని ఉన్నది.

నిద్రమేల్కొను వేళ అంటే వేకువజామే కదా ! పల్లెటూళ్ళలో ఇప్పటికి వేకువజామున చుక్క పొడుచుట తెల్లవారుచున్నదని గ్రహించెదరు. పై వచనములో నిద్రమేల్కొను వేళలో రక్షించబడెదరని, రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నదని చెప్పబడినది. దీని విషయమై లోతు దినములకు నోవాహు మరియు కొన్ని కాలములను పోల్చి చూద్దాం. లోతు నామకార్ధపు భక్తిపరుడైనప్పటికి విశ్వాసిగా సొదమలొ నిలువబడియుండెను. ప్రేమ అను తలరాయి లోతు కుటుంబముపై అమర్చబడినప్పుడు లోకము మీద ప్రేమ వారికి తొలగిపోయినది గనుక అతని కుటుంబమును యావే దూతలు తెల్లవారినప్పుడు నాశనము కాబోవు ఆ పట్టణము నుండి సోయరుకు దాటించినప్పుడు వారు దాటి వెళ్ళిరి. అది సర్వోన్నతుని ప్రేమయే వారిని రక్షించినది. ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. లోకమును లోకములో ఉన్నవాటిని ప్రేమించి లోతు భార్య వెనుతిరిగి ఉప్పుస్థంభము అయినది ఆది 19:15-22.

లోతు సొయరుకు వచ్చినప్పుడు ఆ దేశము సూర్యుడు ఉదయించెను. అప్పుడు యావే సోదెమ గొమెఱ్ఱా మీద గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురుపించి నివసించువారందరిని నేలమొలకలను నాశనము చేసెను. ఆదికాండము 19:23-25. ఇక్కడ సూర్యుడు ఉదయించుట రెండు పట్టణములు నాశనము అగుట గమనించగలము. సూర్యుడు ఉదయించినప్పుడు పట్టణములు మరియు రాత్రి ఒకే సమయములో గతించుట పగలు ప్రారంభమగుట గమనించగలము.

పై సందర్భమును బట్టి తెల్లవారుజాము అనునది శ్రమల నుండి నిజవిశ్వాసులకు రక్షణ సమయము అయ్యుండగా, సూర్యొదయము అనునది లోకము (రాత్రి) గతించి పగలు (మెస్సయ్య పరిపాలనకు) ప్రారంభము అయ్యున్నది. హల్లెలూయ.

 • నిర్గమ 14:24-27 లో వేకువజామున యావే ఆ అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండును కలవరపరచగా ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటి ఒడ్డుకు వెళ్ళిరి. అంటే అప్పటి వరకు ఇజ్రాయేలీయులు యావే రక్షించునని విశ్వాసముతో ఎదురు చూచుచు ఊరక నిలిచియుండిరి. వేకువ జామున ఇజ్రాయేలీయులకు సర్వాధిపతికంటే ఎక్కువగా మరి దేనిని ప్రేమించని ప్రేమ ఇవ్వబడినప్పుడు ఐగుప్తు వైపు చూడక ఐగుప్తీయులకు కలుగు నాశనము నుండి ఇజ్రాయేలీయులు రక్షించబడిరి. అంటే విశ్వాసులైనప్పటి కంటే గొప్ప రక్షణలోనికి వేకువజామున వారు దాటి వెళ్ళిరి.

సూర్యుడు ఉదయించినప్పుడు ఐగుప్తు సైన్యము నశించినది. అంటే రాత్రి మరియు ఐగుప్తు సైన్యము ఒకే సమయములో నశించెను. అప్పుడు చీకటిలేని పగలు ప్రారంభమైనది. ఇక్కడ వేకువజాము అనునది నీతిమంతులు ధోషులతో పాటు నశించి పోకుండా రక్షించబడు సమయము అయ్యున్నది.* నోవాహును అతని కుటుంబమును ఏడు దినములైన తరువాత ఓడలోనికి ప్రవేశించిరి. అదే దినమందు ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. ఆదికాండము 6:10-13, ఏడుదినము (ఏడు సంఘకాలము) లైన తరువాత ఎనిమిదవ దినమే వచ్చును. ఎనిమిదవ దినము ఖచ్చితంగా వేకువజాము సమయము అయ్యున్నది. ఏడు సంఘకాలములు ఏడు దినములు అయ్యున్నవి. ఏడుగురు దూతల తరువాత వేకువచుక్క వాగ్దానము చేయబడియున్నది. గనుక వేకువజాము అనునది ఎనిమిదవ దినము అయ్యున్నది. అబ్రహాము నా దినమును చూడగోరెను అని మెస్సయ్య చెప్పెను. యోహాను 8:56. ఇక్కడ మెస్సయ్య కాలము ఒక దినముతో పోలచ్చబడినట్లే వేకువజాము సమయము ఒక దినము తో పోల్చబడినది. ఇక్కడ నోవాహు కుటుంబము ఎనిమిదవ దినములో ఓడలోనికి వెళ్ళినదంటే ఎనిమిదవ దూత (వేకువచుక్క) వచ్చినప్పుడు వేకువజామున ఓడలోనికి వెళ్ళారని అర్ధము. అదే దినమందు జలప్రళయము వచ్చిందంటే ఎనిమిదవ దినములోనే సూర్యుడు ఉదయించాడని జలప్రళయము వచ్చి లోకము నశించిందని ఆ తరువాత నూతన రాజ్యము వచ్చినదని గ్రహించగలము. గనుక ఉదయముకాలమున ఎనిమిదవ నక్షత్రము ఒక కాలమును తప్పక సూచించును. ఇది తెల్లవారుజాము సమయము. ఇది లోక నాశనము నుండి వధువు తప్పించబడు సమయము. సూర్యొదయమున లోకమునకు యావే ఉగ్రత వచ్చును. ఒకే దినమున రెండు కార్యములు. ఇదే మనుష్య కుమారుని దినము.

లోకము ఈ నాడు లోతు దినములలో వలె, నోవాహు దినములలో వలే ఉన్నది. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారునాటుచు, ఇండ్లు, కట్టుచు, పెండ్లిడ్లు చేసి కొనుచు, పెండ్లిడ్లు కిచ్చుచు ఉన్నారు. ఈ యుగము అంతము కాబోతోందని గ్రహించక మేము ఎంతో అభివృద్ది చెందామని ఇప్పటి లోకము అభిప్రాయపడుచున్నది.

నోవాహు కాలములో, లోతు కాలములో పాపులను నాశనము చేసిన సర్వశక్తిమంతుడు ఇప్పుడును పాపులను నాశనము చేయక మానడు. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినమున జలప్రళయము వచ్చినట్లే, లోతు సొదెమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గధకములు కురిసినట్లే వేకువజామున (ఎనిమిదవదినము)న పెండ్లికుమార్తె ఈ ప్రపంచమును విడిచి మధ్యాకాశమునకు వెళ్ళి వెంటనే భూమి మీద శ్రమలు ప్రారంభమగును. ఆతరువాత నాశనము సంభవించును.

పెండ్లికుమార్తె ఏ దినమున మధ్యాకాశమునకు వెళ్తుందంటే ఉదయ నక్షత్రము యొక్క దినములలోనే, హల్లెలూయ. అది ఎనిమిదవ దినము మరియు మొదటి దినము అయ్యున్నది.ఎనిమిది నిత్యత్వము అయ్యున్నది. ఎనిమిదవ దినము అనగా నూతన సృష్టి, నోవాహు యొక్క ఎనిమిది మంది కుటుంబము ద్వారా నూతన జనాంగము వచ్చారు. ఎనిమిదవ దినముననే నూతన సమాజము స్థాపించబడినది. ఎనిమిదవ దినములో వేకువజామున మెస్సయ్య సమాధి నుండి తిరిగి లేచాడు. అదేవిధంగా వధువు ఎనిమిది దినములో వేకువజామున మధ్యాకాశమునకు ఎత్తబడును. మామిడిచెట్టు ఏ కాలములో కాయలు కాయునో ఆదే చెట్టు నుండి వచ్చిన విత్తనము ద్వారా వచ్చిన చెట్టు కూడ అదే కాలములో కాయలు కాయును, చెట్టు ఏ కాలములో కాయలు కాయునో దాని నుండి వచ్చిన చెట్టు కూడ అదే కాలములో కాయలు కాయును. ఒకే జాతి చెట్లు ఒకే సమయములో కాయలు కాయును. పెండ్లికుమారుడు పెండ్లికుమార్తె ఒకే జాతి గనుక పెండ్లికుమారుడు వేకువజామున తిరిగిలేచాడు గనుక పెండ్లి కుమార్తె వేకువజామునే పైకి లేస్తుంది.హల్లెలూయ.

 • 11 పేతురు 1:16-19 లో పరిశుద్ద పర్వతము మీద ఆయనతో కూడ ఉండిన వారమై ఆయన మహాత్యమును కన్నులారా చూచిన వారమై ఆయన రాకడ తెలియజేశామని మరియు ఇంతకంటె స్ధిరమైన ప్రవచనవాక్యము మనకు ఉన్నదని, తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నదని, దాని యందు లక్ష్యముంచిన యెడల మేలని పేతురు గారు చెప్పుచున్నారు. పేతురు మెస్సయ్య ను కన్నులారా చూచినవాడై మొదటిరాకను బోధించాడు. ఆ వాక్యము చీకటి గల పాపి హృదయములో వెలుగు తీసుకొని వచ్చినది. అయితే దాని కంటే తెల్లవారి వేకువచుక్క స్థిరమైన ప్రవచన వాక్యమును తీసుకొనివచ్చును. అనగా నీతిమంతులకు రాబోవు పగలు గురించి భోధించును. పగలు గురించి బోధించును అనగా అంతము కాబోవు రాత్రి గురిచి ముందుగా బోధించును. గనుక వధువు అంతము కాబోవు రాత్రి వంటి ఈ లోకము నుండి తప్పించుకొని మద్యాకాశమునకు వెళ్ళును. వేకువచుక్క వచ్చినప్పుడు లేదా ఎనిమిదవ దూత వచ్చినప్పుడు చీకటి గల చోటున వెలుగిచ్చుటకు చుక్కలను ఉపయోగించుకొనడు అంటే పాపికి సువార్త ద్వారములు మూయబడును. ఉదయపుకాలపు దూత పెండ్లికుమార్తెతో ముఖాముఖిగా మాట్లాడును. ఏడవ దూత లోకమునకు చివరి వర్తమానికుడు అయ్యున్నాడు. ఉదయకాలపు దూత తరువాత మోషే ఏలియాలు కడబూరతో యూదుల కొరకు వచ్చెదరు. ఆ తరువాత నీతి సూర్యుడు ఉదయించును. వయ్యెండ్ల పాలన ప్రారంభమగును.

సహోదరుడు బ్రెన్ హాం ఏడు సంఘకాలములు గురిఛి వివరించిన పుస్తకము ఉన్నది, ఆ పుస్తకములో తుయతైర సంఘమును గురించి చెప్తూ చివరిలో వేకువచుక్క గురించి వివరించారు.అది ఈ విదముగా వ్రాయబడి ఉన్నది.

చీకటి కాలములో జీవించిన వారికి వేకువచుక్క వాగ్ధానము చేయబడియున్నది. ప్రదాన నక్షత్రమగు (వేకువచుక్క) యాషువా ఏ మానవుడు సమీపించజాలని వెలుగులో నివాసము చేయుచున్నాడని ఆయన తన భవిషత్తు రాజ్యములో వారిని తన యొక్క స్వంత వ్యక్తిగత సన్నిధి ద్వారా వెలిగించునని, ఇక మీదట ఆయన చీకటిలో వెలుగు ఇచ్చుట చుక్కలను (వర్తమానికులని) వాడుకొనడని యాషువాయే స్వయముగా వారితో మాట్లాడునని, ఆయన తన రాజ్యము యొక్క సంగతులను ముఖాముఖిగా వారితో పంచుకొనునని చెప్పిరి.

ఆ తరువాత సూర్యుడు ఉదయించునని చెప్పిరి. ఆయన తన రాజ్యమును ఏలుచుండగా ఆయన సముఖమందు జీవించెదమని చెప్పిరి. ఈ కార్యము శ్రమకాలము తరువాత జరుగును. వేకువచుక్క గురించి కొన్ని ఋజువులు మీ ముందు ఉంచాను.

వేకువజాము సమయము ఏ విధంగా బయలుపరచబడినదో వివరించెదను.

ఏ పాస్టరు ద్వారా గాని, సంఘపెద్దల ద్వారా గాని మరియు ఏ మనుష్యుని ద్వారా తెల్లవారు జామున ప్రేమ అను తలరాయి తెలుసుకొనలేదు గాని ముందుగా కలల ద్వారా లేఖనముల ద్వారా ఈ కాలము బయలుపరచబడినది. ప్రతి కాలములో సర్వశక్తిమంతుడు తన దూతలను పంపినప్పుడు అది ఏ కాలమో బయలుపరచబడుటయే గాక ఆ కాలమునకు సంబంధించిన లేఖనములు నెరవేరినవి. యోహాను వచ్చినప్పుడు అది ఏ కాలమో బయలు పరచబడుటే గాక ముందుగా ప్రవక్తల చెప్పిన ప్రతి లేఖనము ఆ కాలమున నెరవేరినది. మెస్సయ్య వచ్చినప్పుడు అది ఏ కాలమో బయలు పరచబడుటే గాక ముందుగా ప్రవక్తలు చెప్పిన ప్రతి లేఖనము ఆ కాలమున నెరవేరినది. లవొదికయ సంఘకాలములో ఏలియా వచ్చినప్పుడు అది సాయంకాలమని బయలిపరచబడుటే గాక ముందుగా ప్రవక్తలు చెప్పిన ప్రతి లేఖనము ఆ కాలము నెరవేరినది. అలాగే వేకువచుక్క ఉదయించినప్పుడు ఇది వేకువజామని బయలుపరచబడుటే గాక ముందుగా ప్రవక్తలు చెప్పిన ప్రతి లేఖనము వేకువజామున నెరవేనును.

పరిచయము :

నేను జూన్ 22, 1969 లో ఒంగోలు దగ్గర గల బొద్దులూరివారి పాలెం అను ఒక చిన్నకుగ్రామంలో జన్మించాను. ఇది ఆంద్రప్రదేశ్ లో ఉంది. మాకుటుంబము విగ్రహారాధన చేయు కుటుంబాము. మా అమ్మగారు డాక్టరు దగ్గరకు వెళ్ళినప్పుడు డాక్టరు గారు ఎనిమిదవ నెలే గదా ప్రసవించుటకు ఇంకా సమయము ఉన్నదని చెప్పిరి. అదే దినము మా అమ్మమ్మగారి ఇంటి దగ్గరలో ఉన్న చర్చి ప్రారంభోత్సవానికి వెళ్ళి మా అమ్మగారు పాస్టరుగారిచేత ప్రార్ధన చేయించుకొనిన వెంటనే నొప్పులు రావటం నేను జన్మిండం జరిగింది. ఆ తరువాత మా అమ్మకి ధనుర్వాతం వచ్చి హాస్పటల్లో చేరగా నేను ఇంటి దగ్గర ఉన్నానట. అప్పుడుకొన్ని దినములకు నేను చనిపోగా ఇంటి బయట పడుకోబెట్టారు. కొద్ది సమయము తరువాత మరల కదలడం చూసి మరల నాకు జీవం వచ్చినదని, లోపల పరుండబెట్టారు. గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్టించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితినని (యిర్మియా 1:5) లో చెప్పబడిన ప్రకారము డాక్టరు గారు ప్రసవించుటకు ఇంకా సమయము ఉన్నదని చెప్పినను అదే దినమున పాస్టరు గారు ప్రార్దించుట ద్వారా జన్మించానని మా అమ్మ చెప్పింది. సర్వాదిపతి పౌలుగారిని తల్లి గర్భమునందు పడినది మొదలు కొని ప్రత్యేక పరచినట్లే నన్నును తన పరిచర్య కొరకు ప్రత్యేక పరచుకొనెను, గలతి 1:15.

నేను ఏడేండ్ల వయస్సులో ఉండగా మా ఇంటిలో పనిచేయు వృద్దురాలు మెస్సయ్యను గురిచి నాకు తెలియజేసి ప్రార్ధించి, ప్రార్ధన చేసుకోమని ప్రోత్సహించేది. ఏ కాంతంగా ప్రార్దించేవాడిని. ఆ విధంగా మొదటిసారి మెస్సయ్యను గురిచి తెలుసుకున్నాను. అయితే విగ్రహారాధనకి మద్య వ్యత్యాసము తెలియక మెస్సయ్యతో పాటు విగ్రహారాధన చేసేవాడను.

నాకు ఊహ తెలియక మా గ్రామములో ఒకతను రోగము వలన మరణించగా ఆ మరణము నన్ను ఎంతో కదిలించినది. నేను ఏడ్చేవాడను. మనిషి మరణం లేకుండా నిత్యము ఉండాలంటే ఏ విధంగా సాధ్యపడుతుందని పదే పదే ఆలోచించేవాడిని. మరణంలేని జీవితం (అక్షయత) గురించి ఒక ప్రశ్న నా హృదయములో నిలిచిపోయినది. ఏడవ తరగతి పరీక్షలు వ్రాసిన తరువాత మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరలో ఉన్న చర్చి మీద “పునరుద్ధానమును, జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:12 అని ఉన్నది. ఈ మాట చదివాక నేను ఎప్పటి నుండో వెదకుచున్న మరణమునకు జవాబు దొరికినట్లయినది. మరణమును గూర్చిన వేదనంతా తొలగిపోయినది. మెస్సయ్యని నమ్మినట్లయితే మరణించినా తరువాత మరల బ్రతుకుతాను అని అనుకొని మొట్ట మొదటి సారిగా చర్చికి వెళ్లాను. అదే రోజున ఏడవ తరగతి పరీక్ష పలితాలు రావడం పాసవ్వడం జరిగినది. కాని విగ్రహారాధన తప్పని తెలియక విగ్రహారాధన నేను మానలేదు.పదవతరగతికి వచ్చేసరికి మెస్సయ్యను ఆరాధించుట కంటే విగ్రహాలకు ఎక్కువగా నమ్మి వాటిని ఆరాధించినప్పటికి పదవ తరగతి పాసవ్వలేదు. ఏడవ తరగతిలో చర్చికి వెళ్ళిన రోజునే రిజల్సు రావటం పాసవ్వడం జరిగింది. విగ్రహాలు మోసగించాయి మెస్సయ్యే గొప్పవాడని విగ్రహాల వట్టివని విగ్రహాలను విసర్జించి మెస్సయ్యను ఆరాదించుట ప్రారంభించాను.

మరల పాసవ్వని సబ్జెక్ట్సుచదవి పడవతరగతిపాసయ్యాక కాలేజీలో చేరడం అక్కడ ఒక సహోదరుడి ద్వారా కాకినాడలో పాస్టరు  యం.జాన్సన్ గారి గురించి వినడం జరిగినది. జాన్సన్ గారు ఏలియా వలె సత్యము కొరకు నిలువబడినవారు. సర్వాధిపతి ఒక్కడని, యాషువా మెస్సెయ్య నామములో రక్షణ అని బొధిన్తూ, దుర్బోధలైన మతశాఖ గుంపులను ఖండిస్తూ అపోస్తులుల బోధ కొరకు పోరాడినవారు అని తెలుసుకున్నాక పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి 1988 లో జాన్సన్ గారి మీటింగ్స్ కి హాజరయ్యి అక్కడే యాషువా మెస్సయ్య నామములో బాప్తిస్మము పొందాను. అప్పుడు జాన్సన్ గారు ప్రార్దించి ఫిలేమోన్ (PHILEMON) అని పేరుపెట్టారు.

నా దగ్గర ఉన్న నూతన నిబంధన చవుదుకోనేవాడిని. అదే మొదటిసారి బైబిల్ చదవటం. బైబిల్లోని నిత్యము ప్రార్దించుము అనే మాట నన్ను బలముగా పట్టుకునిన దానిని బట్టి ఎడతెగక ప్రార్దించేవాడిని.

కలలు :

పాస్టరు యం.జాన్సన్ ని సముద్రములో నుండి బంగారపు రవ్వలు ఆకాశమునకు వెళ్ళుచు అందులో నుండి ఒక స్వరము జాన్సన్ నీవు నన్ను గూర్చి ప్రకటించమని ఒక స్వరము పలికినదట. అదే బంగారురవ్వలు నన్ను కమ్ముకొన్నాయి.

 • 1998 ఒక రోజు రాత్రి కలలో బంగారపు రవ్వలు నన్ను పూర్తిగా కమ్ముకొనినవి అప్పుడు నాపాదములు భూమి మీద నిలువలేదు గాని భూమికి పైగా నిలిచియున్నవి. అప్పుడు నేను నన్ను కమ్ముకొన్న చిన్న చిన్న బంగారపు రవ్వల వశములో ఉన్నాను. అవి ఎటు తీసుకొనిపోవుచున్నవో అటుపోవు చున్నాను. అంటే అప్పుడు సర్వాధిపతి తనని గురుంచి ప్రకటించమని జాన్సన్ గారిని పంపి, నేడు ఇంకొకరిని పంపక ఆయనే దిగివచ్చి బోధించుచున్నాడని గ్రహించితిని.
 • 1993 కలలో ఆకాశము నుండి అగ్నికణములు, వెలుగు అగ్ని కణములతో నా తల మీద పడుచున్నవి. టెన్ కమాండ్ మెంట్స్ పిక్చర్ చూసిన వారికి గుర్తుండే ఉంటుంది. అందులో అగ్ని జ్వాలలు, అగ్ని కణములు పెద్ద పెద్ద తారాజువ్వ వలే వెళ్ళి రెండు పలకల మీద పది ఆజ్ఞలు వ్రాస్తూ ఉంటాయి. అదే విధముగా అగ్నిజ్వాలలు, అగ్ని కణములు సుడులు సుడులుగా తిరుగిచూ ఆకాశమునుండి ఒకదాని తరువాత ఒకటి దూసుకువస్తూ నాతల మీద రాలినవి.
 • 1995 లో పాస్టరు యం.జాన్సన్ గారు నిద్రించినప్పుడు సమాజముతో పాటు నేను కూడ పాస్టరు గారు నిద్రించిన దానిని బట్టి సమాజము విషయమై బహు భారము కలిగి ప్రార్దించుచుంటిని. జాన్సన్ గారు బ్రతికుంటే సువార్త బోధించే వారు. నేను దేవునికి పనికిరానివాడినని నన్ను తీసుకొని ఆయన్ని ఉంచాల్సింది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు నడిపిస్తారని ప్రార్దించే వాడిని. ఆ సమయములో నేను ఒక కల చూచితిని. ఆ కలలో చాలా ప్రకాశవంతమైన తెల్లని మేఘము గొప్ప ఉరుములతో ఆకాశము నుండి దుగివచ్చుట చూచితిని. ఎప్పుడు నా జీవితములో ప్రకాశవంతమైన తెల్లని మేఘమును చూడలేదు. ఏచాకలి తెలుపు చేయలేనంత తెల్లగా ఉన్నది. నేను ఒక గదిలో ఉన్నాను. నేలమీద దిగిన మేఘమును చూస్తున్నాను. ఆ మేఘము సూర్యుని కంటే గొప్ప కాంతితో ఉన్నది. ఆ సమయమున ఆకాశమందు సూర్యుడు గాని సూర్యుని కాంతి గాని భూమి మీద లేదు. క్రిందికి దిగిన మేఘము యొక్క కాంతి ఒక పగలువలె ఉన్నది. నేనున్న గదిలోనే సమాజము యొక్క సహోదరి, సహోదరులు చాలా గాఢముగా నిద్రిస్తూ బహు మత్తులై యున్నారు. నేను కిటికీలో నుండి భూమి మీద దిగిన మేఘమును చూస్తున్నాను. అప్పుడు నిద్రిస్తున్న సమాజములోని వారి దగ్గరకు వెళ్ళి సర్వశక్తిమంతుడు దిగాడు. లేవండి, అని పెద్ద కేకలు పెడుతున్నాను. వారు ముఖము నుండి కాళ్ళ వరకు కప్పుకున్నదుప్పటిని లాగుతున్నాను. పదే పదే ఆ విధముగా చేసాను వారు లేవలేదు. నేను కిటికీ దగ్గరకు వెళ్ళి ఆ మేఘమును చూసాను. సర్వశక్తిమంతుడు ఆ మేఘములో అక్కడే ఉన్నాడు. నేల మీద సర్వాధిపతి దిగాడు. ఆయన దిగిన ప్రాంతములో నేల దహించుకొని పోతుందేమో, ఎందుకంటే ఆయన అగ్ని గదా అని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆ మేఘము గొప్ప ఉరుముతో పైకి వెళ్ళుచుండగా నేను మోకరిల్లి రెండు చేతులు పైకెత్తి పెద్దగా యావేని ఘనపరచుచున్నాను.హల్లెలూయ. వేకువజాము వర్తమానము పెండ్లికుమార్తెను నిద్రలేపు వర్తమానమని 1996 లో యావే బోధించెను.

మరుసటి రోజు కలలో ఒక తోటలో నేను ఉన్నాను. తెల్లని బట్టలు ధరించిన ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి చేతిలో విత్తనములు పొసివెళ్ళెను. ఆ తరువాత విత్తనములు అనగా వాక్యము అని బయలుపరచబడినది. పరిశుధాత్మ నడిపింపు అంటే తెలియని నాకు పరిశుద్దాత్మ నడిపింపు అంటే ఏమిటో రుచి చూశాను. ఆ తరువాత యావే వర్తమానములు ఇచ్చుట ప్రారంభించారు. వాక్యము ద్వారా సర్వాధిపతి కొరకు నేను ఏలాగు నిలువబడాలో నాకు బోదించారు. బైబిల్ చదువు కుంటునప్పుడు ఎక్కడైనా అర్ధము కాకపోతే ఆయన సన్నిధిలో ప్రార్దించేవాడిని వేకువచుక్క గురుంచి బైబిల్లో చదివితిని. అదినాకు అర్ధమవ్వలేదు. ప్రార్దించితిని గాని బయలుపరచబడలేదు. వేకువచుక్క గురుంచి ఆ ప్రశ్న నాలో ఉండిపోయినది. ఆ తరువాత యావే మొట్టమొదటిగా “మనము ఏలాగు అబ్రహాము సంతానము” అనే వర్తమానమును బయలుపరచెను.
మొదటి సారి నర్సీపట్నంలో 1996 లో సమాజములోని వారు ప్రసంగించమన్నప్పుడు అప్పుడు ప్రేమ గురిచి పరిశుద్దాత్మ బయలుపరచినందున ప్రేమ గురిచి భోధించితిని. విస్వాసు లందరిని బహుగా ఆ వర్తమానమును కదిలించినది. ప్రేమ గురిచే యావే నాచేత ప్రకటింపచేసిన మొదటి ప్రసంగము. నర్సీపట్నం నుండి జనవరి 22 వ తేదీన కాకినాడ వెళ్తుండగా వేకువచుక్క గురిచి యావే బయలుపరచెను. వేకువచుక్క అనేది రాబోవు పగలు గురిచి భోదించునని, ఇది వేకువజాము సమయమని, ఈ సమయములో నీతి మంతులు యావే ప్రేమ ద్వారా రక్షించబడతారని, 1988 లోను, 1993 లోను, నాకు ఇవ్వబడిన కలలు మరియు ప్రకటన 2:28, 22:16, రోమా 13:11-12, 11పేతురు 1:16-19 లేఖనములు నెరవేర్చబడే కాలము ఇదేనని 1996 లో యావే బయలుపరచినది మీ ముందుంచుతున్నాను.

 • 1993 లో కల చూచితిని. ఆ కలలో తూర్పున ప్రకాశవంతమైన నక్షత్రము కనబడినది. ఆ నక్షత్రములో నుండి అగ్నిజ్వాలలు అగ్ని కణములు వెలుగును విరజిమ్ముకుంటూ తాడిచెట్టుకంటే లావు గల పెద్ద తాడు వలె తూర్పు నుండి పడమరకు దూసుకుని వెళ్ళుచున్నది. ఆ జ్వాలల ముందు భాగములో నుండి ఒక గంభీరమైన స్వరము ఇదిగో ! త్వరగా వచ్చుచున్నాను అని వినబడినది. ఆ స్వరమును బహు కొద్దిమంది విన్నారు. అదే కలలో కాఫీ కలర్ పొగవంటిది. కిటికీల గుండా భవనములోనికి వెళ్ళుచున్నది. అప్పుడు ఒక స్వరము ఆ పొగ దురాత్మ అని చెప్పినది. అయితే ఈ కల భావము అర్ధము అవ్వలేదు. నేను అన్యులలో నుండి వచ్చాను గనుక వేకువచుక్క గురింఛి బైబిల్లో ఉన్నవిషయము నాకు తెలియదు. అయితే ఈ కల భావము 1996 లో బయలుపరచబడినది.

ఇక ప్రపంచము దురాత్మకు విడిచిపెట్టబడినదని లోకమునకు సువార్త ద్వారములు మూయబడినవని వేకువచుక్క పగటికి ముందు కనబడి లోకమునకు శ్రమలు మరియు పగలు రాబోతున్నవని ప్రకటించునని అప్పుడు పెండ్లికుమార్తె మద్యాకాశమునకు ఎత్తబడునని బయలుపరచెను. మెస్సయ్య మరియు నోవాహు, లోతు వేకువజామునే శ్రమల నుండి తప్పించబడిరి గనుక పెండ్లికుమార్తె వేకువజామునే శ్రమల నుండి తప్పించుకొంటుందని సర్వాధిపతి చెప్పెను. హల్లెలూయ. అయితే ఈ కల 11 పేతురు 1:-19 లో వేకువచుక్క ఉదయించినప్పుడు లోకసువార్త కంటే రాబోవు పగలు గురుంచి ప్రకటించునను లేఖనమునకు ఖచ్చితంగా సరిపోవుట చూచితిని.

ఆ తరువాత కొద్ది దినములకు సహోదరుడు బ్రెన్ హాం గారు ఏడు సంఘకాలముల వివరణ అను పుస్తకములో చీకటి కాలములో జీవించినవారు వేకువచుక్క వాగ్దానము చేయబడియున్నది. ప్రధాన నక్షత్రమగు (వేకువచుక్క) యాషువా ఏ మానవుడు సమీపించజాలని వెలుగులో నివాసము చేయుచున్నాడని ఆయన తన భవిషత్తు రాజ్యములో వారిని తన యొక్క స్వంత వ్వక్తిగత సన్నిధి ద్వారా వెలిగించునని. ఇక మీదట ఆయన చీకటి వెలుగును ఇచ్చుటకు చుక్కలను (వర్తమానికులను) వాడుకొనడని యాషువాయే స్వయముగా వారితో మాట్లాడునని, ఆయన తన రాజ్యము యొక్క సంగతులను ముఖా ముఖిగా వారితో పంచు కొనునని చెప్పిరి. ఇది చదివాక నాకు వచ్చిన కలకి ఖచ్చితముగా సరిపోయినది. చీకటిలో ఉన్న పాపుల కొరకు వెలుగు తఇచ్చుటకు ఇక వర్తమానికులను సర్వాధిపతి వాడుకొనడంటే లోకమును దురాత్మకు అప్పగించుననే గదా అర్ధము. నాకు వచ్చిన కలకి, లేఖనములకు బ్రెన్ హాం గారు చెప్పిన దానికి సరిపోయినందున ఈ కల ప్రస్తుత కాలమును తెలియజేయుటకు సంబంధించినదని గ్రహించితిని.

 • 1993 లో మరొక కలను చూచితిని. ఆకాశమందు ప్రకాశవంతమైన తెల్లని మేఘము చూచితిని. కొంతమంది మనష్యులు క్రింద ఉండి ఆ మేఘమును దూషిస్తున్నారు. ఈ కలంతా మా ఇంటి ముందు ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంటి పైన ఆకాశమందు జరుగుచున్నది. ఆ ప్రకాశవంతమైన తెల్లని మేఘము అగ్నిమేఘము వలె మారినది. అది పెద్ద పెద్ద అగ్ని కణములుగా విడిపోయి దూషిస్తూ క్రింద ఉన్నవారి పైన పడినది. వారు పారిపోయిరి.
 • 1995 లో యాదృశ్చికంగా నేను పైన చెప్పిన కల చూచిన ప్రాంతములోనే మా పాష్టరు యం. జాన్సన్ గారు మీటింగ్ పెట్టారు. మాయింటిముందు ఉన్న ఇంటి ముందు మీటింగ్ పెట్టారు. అప్పటికి ఆయన కొద్ది నెలల నుండి అనారోగ్య కారణముగా బలహీనముగా ఉన్నారు. మీటింగ్స్ చాలా ఉజ్జీవముగా జరిగినవి. ఆ మీటింగ్స్ అయ్యాక కాకినాడ తిరిగి వెళ్ళారు. తరువాత ఆయన సర్వాధిపతి యందు కొద్ది దినములకు నిద్రించారు. అదే ఆయనకు చివరి మీటింగు.

 

1996 లో నేను పరిచర్యకు యావే చేత పిలువబడినప్పుడు పై విషయమంతా బయలుపరచెను. ప్రకాశవంతమైన తెల్లని మేఘము అగ్ని మేఘముగా మారుట అనగా పరిచర్య మారుట అయున్నది. నిర్గమ 14:19-27 లో ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందు నడిచిన యావే దూత వారి వెనుకకు పోయి వేకువజామున అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రధచక్రములను ఊడిపడునట్లు చేయగా వారు మనము పారిపోదము రండి యావే వారి పక్షమున మనతో యుద్దము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఈ వచనములో యావే కార్యము మారినది యావే ఇశ్రాయెలీయులతో పాటు ఐగుప్తు సైన్యమును వెంబడించనిచ్చెను. కాని వేకువజాము సమయమున ఇజ్రాయెలీయులకును ఐగుప్తుసైన్యమునకును మద్య ప్రేమ అను తలరాయి నిలిచి ఇజ్రాయెలీయులను, ఐగుప్తీయులను వేరుపరచెను. వేకువజామున కార్యము మారినది. గమనించారా? సమూహమునకు ముందు నడవక యావే వేకువజామున ఇజ్రాయెలీయులకు ఐగుప్తుసైన్యమునకు మద్య నిలిచెను. తెల్లని మేఘమును దూషించుట అనేది మెస్సయ్య తనను దూషించు పాపిపట్ల కనికరమును కలిగియున్నాడనుటకు సాదృశ్యముగా ఉన్నది. లవొదికయ సంఘకాలము వరకు యావే పాపిపట్ల కనికరము కలిగియుండెను. దూషించు వారిని కనికరించెను. అందుచేత నీతిమంతులతో పాటు పాపులను ఉండనిచ్చెను. గోదుమలతో పాటు గురుగులు ఉన్నవి. గురుగులు మీద గోదుమలు మీద వర్షము కురిసినది. ఇశ్రాయేలీయులతో పాటు ఐగుప్తు సైన్యమును వెంబడించనిచ్చెను. గోదుమలుతో పాటు పొట్టును ఉండనిచ్చెను. ఎందుకంటే అది కృపకాలము. పాపికి సువార్త కాలము వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపము వలె ఉండును. లవొదికయ సంఘకాలములో ఈ మెస్సయ్య వెలుగును పాపికి ఏలియా తీసుకొని వచ్చెను. సహోదరుడు బ్రెన్ హం, పాస్టరు యమ.జాన్ సన్ ఏలియా ఆత్మగలవారు. వీరు సువార్త వల వేసిరి. నా నా విధములైన చేపలు పడినవి. ఇప్పుడు వేకువజామున వలలో నుండి మంచివాటిని బుట్టలో వేసుకొని పనికిరాని వాటిని బయటపారవేయును. అలాగే వేకువజాము అనునది దుష్టలలో నుండి నీతి మంతులను వేరుపరచును. ప్రేమ అను తలరాయి సర్వాధిపతి కంటే ఎక్కువ దేనిని ప్రేమించకుండునట్లు ఆ ప్రేమ ఇశ్రాయేలీయులను ప్రేరేపించినది.ఇది ఆయన యొక్క ప్రేమ. ఆ తరువాత ఐగుప్తీయులను సూర్యుడు ఉదయించినప్పుడు యావే నాశనము చేసెను. నిర్గమ 14:27, వధువు ఎత్తబడి తరువాత సూర్యుడు ఉదయింఛినప్పుడు ఈ లోకం పరిస్థితి ఐగుప్తు సైన్యము వలె ఉండును.

అదే కలలో తెల్లని మేఘములు అగ్నిమేఘముగా మారి అది ముక్కలు ముక్కలుగా విడిపోయి దూషించువారిపై పడగా వారు పారిపోయిరి. ఇది మెస్సయ్య మొక్క వేకువజాము పరిచర్య సాదృశ్యముగా ఉన్నది. వేకువజామున మెస్సయ్య పాపులపట్ల కనికరము కలిగిలేడు. లోకమును ఇక విడిచిపెట్టెను. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయము చేయనిమ్ము పరిశుద్దుడైన వాడు ఇంకను పరిశుద్దుడుగా ఉండనిమ్ము అని దుష్టులతో వాదించక వారిని విడిచిపెట్టెను. ఐగుప్తు సైన్యము పట్ల యావే కనికరము కలిగిలేడు. వారిని ఇక నాశనమ చేయ నిచ్చయించు కొనెను. గనుక ఇప్పుడు కూడా వేకువజామున ఇశ్రాయేలీయులను ఐగుప్తుసైన్యమును వేరుపరచునట్లు పెడ్లికుమార్తెను ప్రేమ అను తలరాయి వాక్యము కంటే మరి ఎక్కువగా దేనిని ప్రేమించనివ్వదు. అందునుబట్టి ప్రేమ అను తలరాయి పొందుకొనిన ఈమెను వేకువచుక్క ఈ లోకము నుండి వేరుపరచును. ఐగుప్తీయుల మద్య పెండ్లికుమార్తె విశ్వాసిగా ఉన్నప్పటి కంటే వేకువజామున రక్షించబడినదిగా ఉన్నది. వేకువజాముకు ముందు ఐగుప్తీయుల నుండి యావే రక్షించునని విశ్వాసముతో ఆమె ఉన్నది. గోదుములను పొట్టును వేరుపరచి గోదుములను కొట్టులోపోసెను. అలాగే పెండ్లి కుమార్తెను వేరుపరచును. ప్రేమ అను తలరాయి పొందుకొనివారే వేరుపరుపరచబడగలరు. వల ను లాగి కూర్చుండి మంచి వాటిని బయట పారవేసినట్లే ప్రపంచమును సర్వాధిపతి దురాత్మకు విడిచిపెట్టెను. ఇదే తీర్పు అయ్యున్నది. తీర్పు సర్వాధిపతి ఇంటి యొద్ద ఆరంభమయితే అవిదేయులైన వారి గతి ఏమగును? ఇక శ్రమలే వారికిగతి. నిజము వేకువజామే తీర్పు సమయము. అది సర్వాధిపతి ఇంటి యొద్ద ఆరంభమగును. సర్వాధిపతి ఇల్లు అనగా సమాజమే. 1995 నుండి సర్వాధిపతి తీర్పు ఆరంభమై యున్నది. తెల్లని మేఘమును పాపులు దూషించిరి. ఆమేఘము అగ్నిమేఘముగా మారి దూషించువారిపై పడెను. ఇప్పుడు నేను వివరించిన ఈ కల మా యింటి ముందు ఒకరి ఇల్లు ఉన్నది. ఆ యింటిపైన ఆకాశమందు ఈ మేఘము మారుట గురుంచి చూచితిని గదా! అదే స్థలములో పాస్టర్ యం. జాన్ సన్ గారు మీటింగు పెట్టారు. ఆ తరువాత మరెక్కడను అనారోగ్యమును బట్టి మీటింగ్స్ పెట్టలేదు. కొద్ది దినముల తరువాత ఆయన నిద్రించారు. 1996 లో నేను పరిచర్యకు పిలువబడితిని.

అప్పుడు కలలను బట్టి లేఖనముల ద్వారా వేకువజాము సమయము బయలుపరచబడినది. యావే కార్యము గనుక వ్యక్తులను ఆయన మార్చెను. యావే లోకమునకు సువార్త ద్వారములు మూసి లోకము నుండి పెడ్లికుమార్తెను తన ప్రేమ అను తలరాయి ద్వారా లేపుచున్నాడు. లోకమునకు సువార్త ద్వారములు మూయబడనట్లయితే పాస్టరు యం.జాన్ సన్ గారిని ఉంచుకొనును గాని లోకమునకు సువార్త ద్వారములు మూయబడినవి గనుక ఆయనను తీసుకొనెను.1995 వరకు పాపుల పట్ల యావే కనికరము కలిగియున్నాడు. గాని 1996 నుండి అవిదేయుల పట్ల యావే కనికరము లేక వారిని దురాత్మకు విడిచిపెట్టెను. పెండ్లికుమార్తెను అవిదేయుల నుండి వేరుపరచుచున్నాడు.హల్లెలూయ. వెలుగును చీకటిని వేరుపరచుచున్నాడు. పరిచర్య మారినట్లు బైబిల్లో చూద్దాం. యెహొషువా వచ్చినప్పుడు మోషే వెళ్ళిపోయెను. ఏలీషా వచ్చినప్పుడు ఏలియా వెళ్ళిపోయెను. ఉదయకాలపు దూత వచ్చినప్పుడు సాయంకాలపు దూత అయిన ఏలియా పరిచర్య ఆగిపోవును. పాపికి సువార్త ఆగిపోవును లోకము నుండి యావే రక్షించునని విశ్వాసముతో ఉన్న పెండ్లికుమార్తె వేకువజామున మధ్యాకాశమునకు చేరి రక్షించబడును. ఏదో ఒక పట్టణము మీదికి యావే ఉగ్రత వస్తున్నట్లయితే ఆపట్టణము విడిచివెళ్ళితే సరిపోతుందిగాని, ప్రపంచం మీదికి యావే ఉగ్రత రాబోతున్నది గనుక మధ్యాకాశమునకు ఎత్తబడవలసిన సమయము ఇదే.
కార్యము మారినప్పుడు వ్యక్తి మారును “బ్రెన్ హాం” (BRANHAM) ఎన్ని అక్షరములు? ఏడు జాన్ సన్ ఎన్ని అక్షరములు ? (JOHNSON) ఏడు ఫిలోమోన్ ఎన్ని అక్షరములు ? (PHILEMON) ఎనిమిది. ఏడు తరువాత ఎనిమిది వచ్చుట చూడగలము. ఏడవ దూత తరువాత ఎనిమిది దూత గుర్తించుటకు పేర్లులోని అక్షరములు గొప్ప ఆనవాలు అయ్యున్నది. నేను పుట్టినది ఎనిమిది నెలలకే. ఎనిమిదవ తేదిన (8-1-1988) న బాప్తిస్మమము పొంది 1996 లో మరల కాకినాడ కు పరిచర్య నిమిత్తమై వచ్చే టప్పటికి మద్య ఎనిమిది సవత్సరములు ఉండుట చూడగలము. అన్ని ఎనిమిదులే ఉదయకాలపు ఎనిమిదవ దూతను గుర్తించుటకు ఇవ్వన్నీ సూచనలు. ఏడవవాడగు హానోకు పైకి కొనిపోబడినట్లు ఏడవ సంఘకాలములో నుండి వేకువజామున పెండ్లికుమార్తె పైకి కొనిపోబడు చున్నది. కడబూర మ్రోగగానే దేహము మారును. వేకువజామున ఇజ్రాయేలీయులు ఎర్రసముద్ర దాటి ఒడ్డుకు వెళ్ళిన మరుక్షణమే పొద్దు పొడిచినది. సముద్రంలో ఐగుప్తుసైన్యము నశించిరి. వేకువజామున పెండ్లికుమార్తె మధ్యాకాశమునకు ఎత్తబడును. భూమి మీద నీతిసూర్యుడు ఉదయించును లోకమునకు శ్రమలు ప్రారంభమగును, ప్రపంచము అంతటికి యావే ఉగ్రత రాబోతోంది గనుక ఓడలోనికో, సొయరుకొకాదు నీవు మధ్యాకాశమునకు తప్పించుకొనుటకు పారిపొమ్ము హల్లెలూయ. ఏడవ దినము కాదు ఇక ఎనిమిదవ దినము. వేకువజామున ఒక నరుడుతో యాకోబు పోరాడెను. ఆశ్వీర్వాదాము పొందెను. రాహబను స్త్రీ వలే తప్పించుకొని పారిపొమ్ము యెలియేజారు ఏడవదూతకు ఎనిమిదవ దూతకు సాదృశ్య ముగా ఉన్నాడు. రిబ్కాకి ఇస్సాకు గురిచి బోధించిన ఏడవదూత అతడే. తెల్లవారుజామున రిబ్కాని ఒంటెల మీద ఇస్సాకు దగ్గరకు తీసుకొనివెళ్ళిన ఉదయకాలపు దూత అతడే ఒకే నక్షత్రము. హల్లెలూయ. కాలము మారినది. సర్వాధిపతి లోకమునకు సువార్త బోధించు వాని వలే లేడు గాని ఆయన సమాజము యొద్ద నుండే వేకువజామున తీర్పు తీర్చుచున్నాడని గ్రహించగలవా ?

ఇది పెండ్లికుమార్తె ఎత్తబడే సమయము. ఇక ఏసమయములోనైనా ఎత్తబాటు జరగవచ్చు. త్వరలో ఈ కాలము ముగియనై నున్నది.లక్షలాది మంది విడిచి పెట్టబడుదురు. త్వరలో మధ్యాకాశమునకు పెండ్లికుమారుడు రాబోతున్నాడు. విడిచిపెట్టబడిన వారికి శ్రమ తప్ప మరొక మార్గము లేదు. నేను చెప్పిన ప్రతిమాట మెస్సయ్య దే గాని నాది కాదు. పాష్టర్లకు, సమాజముకు దూరముగా పెరిగితిని. బైబిలోని వాక్యము ఏమి తెలియని స్థితిలో కలల ద్వారా ఈ కాలమును యావే బయలుపరచెను. ఆ కలలు లేఖనములకు సరిపోయినవి. అందుచేత ఈ వేకువచుక్క కాలమును నేను ఒక మనుష్యుని వలన పొందలేదు. యావేయే ప్రేమ అను తలరాయిని బయలుపరచెను. గనుక రాబోవు ఉగ్రత నుండి ఇంత గొప్ప రక్షణను ఇచ్చి ఎవరు తప్పించగలరు? బహు కొద్దిమందే దీనిని గుర్తిస్తారు. ప్రేమ అను తలరాయి పొందుకొనినప్పుడు ఈ లోకములో ఏదియు గొప్పగా నీకు కనబడదు గనుక లోకములో దేనిని ప్రేమించలేవు.

ఏడవ దూత లేనట్లయితే వేకువచుక్క వచ్చి పగలు వచ్చుచున్నదని ప్రకటించునని బ్రెన్ హాంగారు ఎందుకు చెప్పారు? ప్రకటన 2:28, రోమా 13:11-12, 2 పేతురు 1:17-19, ఎప్పుడు నేరవేరునో చెప్పగలవా? చెప్పలేవు. గనుక ఆలోచించుము. ఏడుగురుదూతల వర్తమాన కాలము ఏడు దినములు యున్నది. వేకువచుక్క వర్తమాన కాలము ఎనిమిదవ దినము అయ్యున్నది. గనుక నీవు తప్పనిసరిగా ఈ కాలమును గగుర్తింఛి యావే ఉగ్రత రాకముందే వేకువచుక్క వర్తమానము క్రిందికి రమ్ము వేకువచుక్క పైకిరమ్ము అని పిలుచుచున్నది. ఎనిమిదవ దూత తరువాత భూమి మీద యావే ఉగ్రత మాత్రమే ఉన్నది. కాలము మారుట అనగా సాయంకాలపు వెలుగు ఉన్న మెస్సయ్య ఇప్పుడు ఉదయకాలపు వెలుగుగానున్నాడు. నీవు పెండ్లికుమార్తెగా ఉన్నట్లయితే రక్షించబడుటకు ఇదే సమయము. హల్లెలూయ ! హల్లెలూయ !

final. 3